Monday, 28 September 2026 05:14:07 PM

భీమిలి బీచ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి.. మహిళకు తీవ్ర గాయాలు

Date : 05 August 2026 05:32 PM Views : 166

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విజయనగరం/జామి : ఆగస్టు 5 (సాక్ష్యం): విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన ఇద్దరు యువకులు బుధవారం భీమిలి బీచ్ రోడ్డులోని తిమ్మాపురం సమీపంలో బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి ముందుగా ఓ కారును ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై ప్రయాణిస్తున్న జామి మండలానికి చెందిన గ్రంది సూరి ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో యువకుడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Micro Venkat

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :