Sunday, 27 September 2026 04:19:09 PM

భీమునిపట్నం డైట్‌లో ఆంగ్ల భాషా దినోత్సవం.

Date : 23 April 2026 06:06 PM Views : 207

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 23:ప్రపంచ ప్రఖ్యాత రచయిత విలియం షేక్సిపియర్ జయంతి సందర్భంగా ఆంగ్ల భాషా దినోత్సవాన్ని భీమునిపట్నంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ (డైట్)లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ జి.జి.ఎస్. నాగేశ్వరరావు షేక్సిపియర్ చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంగ్ల భాష అభివృద్ధిలో షేక్సిపియర్ పాత్ర అపారమని తెలిపారు.

ఆయన రచించిన నాటకాలు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందాయని, భాషా వికాసానికి, పదజాల విస్తరణకు ఆయన చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. షేక్సిపియర్‌ను “ఆంగ్ల భాషా పితామహుడు”గా కూడా పరిగణిస్తారని చెప్పారు. 154 సోనెట్లు, 39 నాటకాలు రచించిన షేక్సిపియర్ నాటకాలు ‘ది గ్లోబ్ థియేటర్’లో ప్రదర్శింపబడి నాటక రంగాన్ని ప్రజలకు చేరువ చేశాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు, శిక్షణార్థులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం Neti sakshyam websiteను ఫాలో అవ్వండి.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :