Wednesday, 05 August 2026 10:51:02 AM

భీమిలి CHCలో DCHS ఆకస్మిక తనిఖీలు..

Date : 13 May 2026 02:22 PM Views : 263

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మే 13: భీమునిపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని DCHS డాక్టర్ ఆర్.ఎన్. సింగ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఓపీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానం, వైద్యుల ఓపీ రిజిస్టర్లను పరిశీలించి ధృవీకరించారు.

రోగులను వైద్యులు ఎలా స్వీకరిస్తున్నారు, వారికి అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లతో చర్చించారు. అలాగే ల్యాబ్, రేడియాలజీ, ఫార్మసీ, ఐసీయూ విభాగాల పనితీరును సమీక్షించారు. అత్యవసర కేసుల నిర్వహణలో వైద్యులు, సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వేగవంతమైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి తెలిపారు. ఆసుపత్రి నిర్వహణలో పరిశుభ్రత, సమయపాలన, సేవా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆస్పత్రి సిబ్బందిని ఆయన ఆదేశించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :