Tuesday, 04 August 2026 07:21:56 AM

విశాఖలో కూటమి నేతల నిరసన

Date : 23 February 2026 09:57 PM Views : 287

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : ఫిబ్రవరి 23//: విశాఖ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కూటమి నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఏఐ సమీట్లో యూత్ కాంగ్రెస్ నేతలు ప్రవర్తించిన తీరును వారు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, బీజేపీ శాసనసభ పక్ష నేత పి. విష్ణు కుమార్ రాజు, విశాఖ టీడీపీ అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

నేతలు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశ అభివృద్ధికి విఘాతం కలిగించే చర్యలను కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని, జరిగిన ఘటనపై క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. యువత ప్రయోజనాలకు అడ్డంకులు సృష్టించే రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :