Tuesday, 04 August 2026 06:28:19 AM

భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రత్యేక తనిఖీలు

Date : 14 July 2026 06:30 PM Views : 123

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : జూలై 14 (సాక్ష్యం):చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం గానీ.. ప్రజా శాంతికి భంగం కలిగించేందుకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దివాకర్ యాదవ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థినుల భద్రత దృష్ట్యా భీమిలి పోలీసు సిబ్బంది మంగళవారం భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన 10 మందిని అదుపులోకి తీసుకుని, మహిళల భద్రత, చట్టపరమైన పరిణామాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కళాశాలలు, పాఠశాలల పరిసరాల్లో ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని భీమిలి పోలీసులు వెల్లడించారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :