Sunday, 27 September 2026 03:35:43 PM

గ్రామీణాభివృద్ధిలో ప్రజాప్రతినిధులదే కీలక పాత్ర

Date : 11 August 2026 07:10 PM Views : 131

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / అనకాపల్లి : ఆగస్టు 11: గ్రామీణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, స్థానిక సంస్థల బలోపేతంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జెడ్పీ ఛైర్పర్సన్ జె.సుభద్ర అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రత్యేక అధికారులకు నిర్వహించిన వన్‌డే శిక్షణ సదస్సులో ఆమె మాట్లాడారు. వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) చట్టం–2025 అమలులో స్థానిక సంస్థల పాత్ర ముఖ్యమన్నారు. గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతన ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి, సహజ వనరుల సంరక్షణకు చట్టం ప్రాధాన్యత ఇస్తుందని డ్వామా అధికారులు వివరించారు. గ్రామ పంచాయతీల ప్రణాళికలు, పనుల పర్యవేక్షణ, సామాజిక తనిఖీలు, డిజిటల్ అటెండెన్స్, జియోట్యాగింగ్, డీబీటీ ద్వారా చెల్లింపులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :