Saturday, 28 November 2026 12:32:08 PM

కలకలం రేపిన అరకులోయలో యువతి మృత దేహం

Date : 18 November 2026 01:22 PM Views : 97

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / అరకు : అరకు, నవంబర్ 18: అల్లూరి జిల్లా అరకు ప్రాంతంలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. కొత్తవలస మార్గంలోని ఓ బ్రిడ్జి కింద 20 ఏళ్ల యువతి మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలు డుంబ్రిగూడ మండలం గుంటగన్నెల గ్రామానికి చెందిన కిల్లో మీనాగా గుర్తించారు. మీనా అరకు ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతోంది. గత ఏడాది ఐటీఐలో చేరిన ఆమె చదువుకుంటూ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుంది. ఆమె తండ్రి కృష్ణ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బ్రిడ్జి కింద యువతి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో అరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. యువతి మృతి ప్రమాదవశాత్తా, ఆత్మహత్యా లేదా ఇతర కారణాలతో జరిగిందా అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. చదువుకుంటూ జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతి అనుమానాస్పద మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :