Sunday, 27 September 2026 03:36:29 PM

పేకాట స్థావరంపై భీమిలి పోలీసుల దాడి

Date : 22 August 2026 07:04 AM Views : 124

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఆగస్టు 22: యేత కుమ్మరిపాలెం ప్రాంతంలో రహస్యంగా జూదం ఆడుతున్న స్థావరంపై భీమిలి పోలీసులు దాడి చేసారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,820 నగదును స్వాధీనం చేసుకున్నారు. భీమిలి సీఐ దివాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న వారిని గుర్తించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. అక్రమ జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :