Tuesday, 04 August 2026 06:32:13 AM

ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి వేడుకలు ఘనంగా

Date : 10 June 2026 11:05 AM Views : 237

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : జూన్ 10: మిషన్ గ్రీన్ భీమిలి, ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమిలి సంయుక్త ఆధ్వర్యంలో భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి వేడుకలు భీమిలి మండలం మహాలక్ష్మిపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేసి, పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి సేవలు, దేశభక్తి భావాలను వారికి వివరించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పిల్లలు పెద్దలు కలిసి 'భారతదేశం నా మాతృభూమి అంటూ ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో మిషన్ గ్రీన్ భీమిలి మరియు ఫేబ్ సభ్యులు స్థానికులు ముమ్మిడిశెట్టి ఆదిత్య, గుల్లల వెంకటేష్, ముసునూరి సూర్య శ్రీనివాస్, పప్పు భరద్వాజ్, ఐనాడ దుర్గాప్రసాద్, కాళ్ల సన్నీ, యరబాల సత్యనారాయణ, పెంటపల్లి దేవానంద్, మారోజు గోపి, కట్టమూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: