Wednesday, 05 August 2026 11:09:01 AM

సంగీత ప్రియులను అలరించిన ‘సంగీత సుధ’

Date : 02 March 2026 09:41 PM Views : 433

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మార్చి 2 : భీమిలి శ్రీ వాసవి కళ్యాణ మండపంలో భీమిలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన “సంగీత సుధ” కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. అధ్యక్షుడు వెల్చేరు చంద్రశేఖర్, కార్యదర్శి ఎం.కోటయ్య తదితరులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించగా.. చిరంజీవులు సిమ్మ షర్మిల, సిమ్మ కావ్యలు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు భక్తి భావాన్ని పంచగా, టంగుటూరి సుష్మ పాడిన త్యాగరాజు కృతులు ఆహూతులను మైమరపించాయి. మూడు గంటల పాటు సాగిన ఈ సంగీత వేడుక భక్తి లోకంలో విహరింపజేసింది. అనంతరం గాయనీమణులను వేదికపై ఘనంగా సత్కరించగా, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కార్యవర్గాన్ని పలువురు ప్రసంశించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: