Tuesday, 04 August 2026 06:28:03 AM

భీమిలిలో మొకర నారాయణరావుకు ఘన నివాళి

Date : 06 July 2026 05:11 PM Views : 101

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : జులై 6: విశాఖ జిల్లా భీమునిపట్నంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ మొకర నారాయణరావు 14వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. జీవీఎంసీ 3వ వార్డు తెలుగు దేశం పార్టీ డివిజన్ కమిటీ అధ్యక్షుడు గొలగాని నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని మొకర నారాయణరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, రాష్ట్ర నాగవంశం సంక్షేమ సంఘం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గాడు సన్యాసి నాయుడు పాల్గొన్నారు. మొకర నారాయణరావు భీమిలి అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన సేవలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నాగవంశం సంక్షేమ సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కీర్తిశేషులు స్వర్గీయ మొకర నారాయణరావు 14వ వర్ధంతి సందర్భంగా ఆయన నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కాళ్లవీధి నాగవంశం సంక్షేమ సంఘం మరియు మొకర కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో నల్లివీధి, అప్పికొండవీధి, కొంకివీధి, గాడువీధి, కృష్ణాకాలనీ నాగవంశీయుల కుల పెద్దలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి 2వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి గాడు చిన్ని కుమారి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొకర నారాయణరావు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా, భీమిలి పురపాలక సంఘం కౌన్సిలర్, వైస్ చైర్మన్, ఉడా డైరెక్టర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వంటి పలు పదవుల్లో ప్రజాసేవ చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భీమిలి నాగవంశం సంక్షేమ సంఘం అధ్యక్షుడు కంటుభుక్త ముత్యాలరావు, రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ గాడు సన్యాసి నాయుడు, సంకురుభుక్త జోగారావు, కనకల అప్పలనాయుడు, చిలకా రమణ, గాడు పైడిరాజు, మద్దిల పైడినాయుడు, కనకల సన్నిబాబు, లచ్చుబుగత ఆదినారాయణ, గాడు ఆనంద్, అప్పికొండ నూకరాజు, మొకర కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :