Monday, 28 September 2026 05:55:37 PM

రేపు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

Date : 02 August 2026 06:35 PM Views : 157

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ పద్మనాభం : ఆగష్టు 2: (సాక్ష్యం): విశాఖపట్నం జోన్-3 పరిధిలోని రేవిడి సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల కారణంగా సోమవారం (ఆగస్టు 3) పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. సింహాచలం నాయుడు తెలిపారు. కోరాడ, సత్యనారాయణపురం 11 కేవీ ఫీడర్లపై అవసరమైన చోట ఏబీ స్విచ్‌ల (AB Switches) మరమ్మతులు, అలాగే చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమాలు చేపట్టనున్నందున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. అయితే, పనులు పూర్తయిన ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కారణంగా కోరాడ, గెడ్డపేట, బద్రయ్యపేట, సుంకరపేట, బొత్సపేట, బి.ఆర్. తాళ్లవలస, లింగన్నపేట, బుడ్డివలస, వెంకటాపురం, అన్నంపేట, పడగలపేట తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. సింహాచలం నాయుడు కోరారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: