Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ పద్మనాభం : మే 26: పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైసిపి సీనియర్ నాయకులు రాజా సాగి చంద్రశేఖర లక్ష్మీసన్యాసిరాజు అలియాస్ దేవుడు బాబు 79వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు ప్రేమగా దేవుడు బాబు అని పిలిచే ఆయన సేవలను పలువురు నేతలు స్మరించుకున్నారు. పేదల పక్షాన నిలబడి గ్రామ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించారని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా దేవుడు బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలకు రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేయగా వేలాదిమంది హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జ్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), టిడిపి నాయకులు అక్కరమాని వెంకట్రావు విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, పద్మనాభం మాజీ ఎంపీపీ గోపిరాజు, ఎంపీపీ కె. రాంబాబు, వైసిపి మండల అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, జెడ్పీటీసీ గిరిబాబు, వైసిపి సీనియర్ నాయకులు మరగడ అప్పారావు, అమజూరి అప్పారావు, ఎమ్మెల్సీ రఘువర్మ, మాజీ సర్పంచులు పల్లి మహేష్, బుగత సత్యనారాయణ, చందక శ్రీనివాసరావు.జెడ్ పిటిసి గిరిబాబు.వైసిపి సీనియర్ నాయకులు మరగడ అప్పారావు, అమజూరి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam