Friday, 12 June 2026 01:45:31 AM

మామిడిపాలెంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

Date : 14 April 2026 05:43 PM Views : 126

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఏప్రిల్ 14: మామిడిపాలెం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా భీమిలి ఇన్స్పెక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన భావజాలాన్ని గుర్తుచేస్తూ సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. సమాజ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన రాజ్యాంగ మార్గం ప్రతి భారతీయుడికి దిక్సూచి లాంటిది” అన్నారు. “విద్యతోనే అందరి జీవితాలు మారుతాయని అంబేద్కర్ చెప్పిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :