Friday, 12 June 2026 01:46:19 AM

జమ్మి చెరువు పార్క్ సమస్యలపై జోనల్ కమిషనర్‌కు వాకర్స్ వినతి

Date : 12 May 2026 07:44 PM Views : 163

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మే 12: విశాఖ జిల్లా భీమిలిలోని జమ్మి చెరువు పార్క్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జమ్మి చెరువు అసోసియేషన్ ఆఫ్ వాకర్స్ సభ్యులు సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా భీమిలి జోనల్ కమిషనర్ విజయకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. పార్క్‌లో మౌలిక వసతులు మెరుగుపర్చడంతో పాటు వాకర్స్‌కు అవసరమైన సదుపాయాలు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గంటా నూకరాజు, బీసీ సెల్ అధ్యక్షులు సంకురభుక్త జోగారావు, నక్కెల్ల వెంకటరావు, జి. పోలిరాజు, కందుల సుందరరావు, శంకరరావు, మురళీ తదితర వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :