Sunday, 27 September 2026 03:35:34 PM

టీడీపీకి మాజీ ఎంపీపీ గోపీబాబు రాజీనామా

Date : 20 September 2026 10:05 PM Views : 93

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబర్ 20: పద్మనాభం మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు, శ్రీ అనంత పద్మనాభ సేవా సంస్థ అధ్యక్షుడు దంతులూరి గోపాలకృష్ణ మూర్తిరాజు (గోపీబాబు) తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన గోపీబాబు అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అప్పటి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌తో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో వైసీపీకి దూరమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీలో చేరారు. టీడీపీలో కొనసాగుతున్న సమయంలో తన పరిధిలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. తాజాగా టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన గోపీబాబు బీజేపీలో చేరారు. గోపీబాబు రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మార్పుగా తాజా పార్టీ మార్పు నిలిచింది. ఈ సందర్భంగా ఆయన అనుచరులు, మద్దతుదారులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :