Sunday, 27 September 2026 03:36:09 PM

గ్రీన్ స్పాట్‌గా మారిన బహిరంగ ప్రదేశం

Date : 05 September 2026 09:06 AM Views : 141

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : సెప్టెంబరు 5: భీమునిపట్నం: నగరంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భీమునిపట్నం జోన్‌లో అధికారులు చర్యలు చేపట్టారు. జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి రోజు ఇంటి వద్దకు వచ్చే క్లాప్ వాహనానికి చెత్తను అందించాలని ప్రజలకు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే ఇంటి యజమానులకు రూ.500, షాప్ యజమానులకు రూ.1,000 జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భీమునిపట్నం జోన్, 3వ వార్డు, కృష్ణా కాలనీ సచివాలయం పరిధిలోని చిన్న బజార్ సమీపంలో వైజాగ్ రోడ్డుపై ఉన్న గార్బేజ్ వల్నరబుల్ పాయింట్‌ను గ్రీన్ స్పాట్‌గా మార్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఎం. విజయ్ కుమార్, మేస్త్రీ రేగాని రవి, వార్డు పారిశుధ్య మరియు పర్యావరణ కార్యదర్శులు పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :