Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఆగస్టు 5 (సాక్ష్యం): భీమునిపట్నం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్, జీవీఎంసీ మూడో వార్డు టీడీపీ అధ్యక్షుడు, విశాఖపట్నం జిల్లా మాజీ ప్లానింగ్ కమిటీ సభ్యుడు గొలగాని నరేంద్ర కుమార్ 45వ జన్మదిన వేడుకలు బుధవారం భీమిలిలో ఘనంగా నిర్వహించారు. భీమునిపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేంద్ర కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గంటా శ్రీనివాసరావును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే భీమిలి జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న 55 మంది పారిశుద్ధ్య కార్మికులకు నరేంద్ర కుమార్ చేతుల మీదుగా వస్త్రాలను పంపిణీ చేశారు. మాజీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్న నరేంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్, రెండో వార్డు కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి మాట్లాడుతూ, యువతకు ఆదర్శంగా నిలుస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశం సంక్షేమ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గాడు సన్యాసి నాయుడు, భీమిలి నూకాలమ్మ అమ్మవారి ట్రస్ట్ చైర్మన్ చురకల రమణ, విశాఖ జిల్లా బీజేపీ కార్యదర్శి కంటుబుక్త సునీతతో పాటు పలువురు టీడీపీ నాయకులు, వార్డు కమిటీ సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, డ్వాక్రా సంఘాల ఆర్పీలు, స్థానికులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam