Monday, 28 September 2026 05:57:52 PM

భీమిలి ప్రభుత్వ పాఠశాల విద్యార్దినులకు క్రీడా కిట్లు

Date : 21 February 2026 12:28 PM Views : 282

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 21: భీమునిపట్నంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ Naandi Foundation ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నన్హి కలీ ప్రాజెక్టు ద్వారా బాలికల విద్యాభివృద్ధికి సహాయ కార్యక్రమం నిర్వహించారు. ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు క్రీడా కిట్లు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. రమణ విద్యార్థినులకు కిట్లు అందజేస్తూ, బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. 1998లో స్థాపించబడిన నాంది ఫౌండేషన్ ఇప్పటివరకు 60 లక్షల మందికి పైగా సేవలు అందించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి. సుధాకర్, నన్హి కలీ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీ గౌరీ, ఉపాధ్యాయులు మరియు బాలికల తల్లిదండ్రులు పాల్గొన్నారు..

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: