Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మార్చి 20:భీమిలి గ్రామదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఈ ఏడాది వచ్చిన ఆదాయ వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. ఈసారి రెండు రోజులపాటు జరిగిన ఉత్సవాల్లో మొత్తం రూ.12,70,682/- ఆదాయం నమోదైనట్లు తెలిపారు. ఇందులో టికెట్ల ద్వారా రూ.7,19,895/- కాగా, హుండీల ద్వారా రూ.5,50,787/- ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. గత సంవత్సరం మూడు రోజులపాటు నిర్వహించిన జాతరలో టికెట్ల ద్వారా రూ.6,91,730/- మరియు హుండీల ద్వారా రూ.5,99,012/- వచ్చి, మొత్తం రూ.12,90,742/- ఆదాయం నమోదైనట్లు తెలిపారు. ఈ ఏడాది తక్కువ రోజుల్లోనే గణనీయమైన ఆదాయం రావడం విశేషమని అధికారులు పేర్కొన్నారు. అహర్నిశలు శ్రీ నూకాలమ్మ అమ్మవారి సేవలో నిమగ్నమై ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ ఆలయ అధికారులు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివరాలను ఈఓ తమ్మినేని పద్మ, సిఎఫ్‌ఓ కీర్తి శ్రీనివాసరావు వెల్లడించారు.
Reporter
Neti Sakshyam