Sunday, 27 September 2026 04:19:10 PM

భీమిలి నీడి వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ

Date : 17 June 2026 05:17 PM Views : 222

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : జూన్ 17:భీమిలి నీడి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిరుపేద వృద్ధులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత నెల 23వ తేదీన నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం, 37 మంది రోగులకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించారు. అలాగే అవసరమైన 24 మంది నిరుపేద వృద్ధులకు ఉచితంగా కళ్లజోళ్లను అందజేశారు. ఈ సందర్భంగా భీమిలి నీడి వెల్ఫేర్ అధ్యక్షులు కైతపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వైద్య సేవలు అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి నీడి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :