Sunday, 27 September 2026 03:36:14 PM

భీమిలి CHCలో DCHS ఆకస్మిక తనిఖీ. ఏం జరిగిందంటే?

Date : 02 September 2026 05:39 PM Views : 140

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : భీమిలి CHCలో జిల్లా సమన్వయ అధికారి (DCHS) డా. నరేంద్ర సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో శానిటేషన్‌ను మరింత మెరుగుపరచాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అవసరమైన అన్ని మందులు CHCలో అందుబాటులో ఉంచాలని, బయట మందులు రాయవద్దని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు అందించాలని సూచించారు. అదేవిధంగా రోగుల పట్ల వైద్యులు ప్రేమాభిమానాలతో, ఆప్యాయతతో వైద్యం అందిస్తున్న తీరుపై DCHS డా. నరేంద్ర సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై ప్రజల్లో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ (PPP) మరింత పెంపొందించేలా పనిచేయాలని ఆదేశించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :