Sunday, 05 April 2026 06:57:44 PM

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు

Date : 31 March 2026 07:14 PM Views : 49

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మార్చి31: మంగళగిరి విద్యాభవన్‌లోని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించనున్న APRS CAT-2026 మరియు APRJC & DC CET-2026 పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. 5వ తరగతి, 6, 7, 8 తరగతులలో మిగిలి ఉన్న ఖాళీలు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను మార్చి 31, 2026 నుండి ఏప్రిల్ 7, 2026 వరకు స్వీకరించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా (https://aprs.apcfss.in⁠�) ఏప్రిల్ 7 లోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు అనంతరం ఎటువంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 24, 2026న నిర్వహించనున్నట్లు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ వివరాలను ఏ.పీ.ఆర్ స్కూల్ గర్ల్స్, భీమునిపట్నం ప్రిన్సిపాల్ (FAC) & డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వై. పద్మలత వెల్లడించారు. ???? సంప్రదించవలసిన మొబైల్ నంబర్: 8712625025

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :