Monday, 28 September 2026 06:00:59 PM

అడ్మిషన్ల కోసం భీమిలిలో బైక్ ర్యాలీ – జివిఎంసీ హై స్కూల్ టీచర్స్ వినూత్న కార్యక్రమం

Date : 26 March 2026 05:22 PM Views : 438

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మార్చి 26: భీమిలిలో పండిట్ నెహ్రూ జివిఎంసీ హై స్కూల్ టీచర్స్ అడ్మిషన్లను పెంచేందుకు వినూత్నంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా స్థానిక ప్రజలు మరియు తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తూ, తమ పిల్లలను నెహ్రూ స్కూల్లో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా టీచర్లు తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి, పాఠశాలలో అందిస్తున్న విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. దీనికి స్పందించిన పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా చేర్పిస్తామని హామీ ఇచ్చారు. భీమిలి మండలంలో మొదటిసారిగా ఉపాద్యాయులే బైక్ ర్యాలీ నిర్వహించడం, పాఠశాల పురోగతికి, విద్యార్థుల అభ్యున్నతికి బాధ్యత వహించడాన్ని పలువురు ప ప్రశంసించారు. విద్యార్థుల మానసిక వికాసం, సమగ్ర వ్యక్తిత్వ అభివృద్ధి కోసం ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీచర్లను తల్లిదండ్రులు అభినందించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: