Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : జూన్ 3: విశాఖపట్నం జిల్లా అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. అండర్-సబ్ జూనియర్ విభాగంలో 9వ తరగతి విద్యార్థి వి. అభినవ్ (70+ కిలోలు) బంగారు పతకం సాధించగా, 8వ తరగతి విద్యార్థి ఎస్. నిఖిల్ (58-61 కిలోలు) కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో ఇద్దరూ జూన్ 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను సన్ విద్యా సంస్థల కరస్పాండెంట్ కైతపల్లి శ్రీనివాస్ అభినందించగా, కోచ్ కుమారి శ్రీవర్షిత సేవలను ప్రశంసించారు.
Reporter
Neti Sakshyam