Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ మధురవాడ : సెప్టెంబర్ 20: విశాఖ జోన్–3 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా పోలాకి శ్రీనివాసరావు మరోసారి అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో జోన్–3లో ఈఈగా పనిచేసిన శ్రీనివాసరావు అనంతరం జోన్–1కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో జోన్–1లో ఈఈగా పనిచేసిన సింహాచలం నాయుడు జోన్–3 ఈఈగా ఇక్కడికి వచ్చారు. తాజాగా సింహాచలం నాయుడికి సీనియర్ స్థాయి పదోన్నతి లభించడంతో, ఆయన స్థానంలో తిరిగి పోలాకి శ్రీనివాసరావును జోన్–3 ఈఈగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు పోలాకి శ్రీనివాసరావు జోన్–3 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో జోన్–3లో పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయనకు ప్రాంతంలోని పనులు, సమస్యలపై అవగాహన ఉందనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన్ని జోన్-3 పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే శ్రీనివాసరావు మళ్ళీ జోన్–3కు రావడంపై కింది స్థాయి అధికారులు, విద్యుత్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Admin
Neti Sakshyam