Wednesday, 05 August 2026 08:47:20 AM

చిన్నారులను పనుల్లో కాదు.. పాఠశాలల్లోనే చూడాలి!

Date : 12 June 2026 04:10 PM Views : 227

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : జూన్12: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమిలిలోని సన్ స్కూల్ వేదికగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమునిపట్నం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి నిరుపమా బంజిదేవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల కార్మిక వ్యవస్థ సమాజానికి శాపమని, ప్రతి చిన్నారి విద్యను అభ్యసించే హక్కు కలిగి ఉందని పేర్కొన్నారు. బాల కార్మికులను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అలాగే విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ కైతపల్లి శ్రీనివాస్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతిరావు, పలువురు న్యాయవాదులు, ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: