Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : సెప్టెంబర్ 19: అక్రమ మద్యం విక్రయాలపై భీమిలి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇది ఎక్సైజ్ శాఖ పరిధిలోని అంశమని భావించి వదిలేయకుండా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా శనివారం భీమిలి పరిధిలోని పలు ప్రాంతాల్లో బెల్ట్ షాపులపై మెరుపుదాడులు నిర్వహించారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్చి IPS ఆదేశాల మేరకు, DCP పర్యవేక్షణలో భీమిలి CI జి. దివాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. చిన్న ఉప్పాడ, నిడిగట్టు, భీమిలి ఎగువపేట, సిటీనగర్, చిప్పాడ ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్న ఉప్పాడలో 5 మద్యం బాటిళ్లు, నిడిగట్టులో 5, భీమిలి ఎగువపేటలో 10, సిటీనగర్‌లో 13, చిప్పాడలో 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఐదు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారు: చెన్నా రమేష్, S/o (లేట్) ఎల్లయ్య గుజ్జు నూకాలమ్మ, W/o (లేట్) రాములు పెద్దిరెడ్డి వెంకటరమణ, S/o వెంకటరావు జీరు ఈశ్వర్ ఎల్లమరెడ్డి, S/o అక్కులరెడ్డి బోర సరస్వతి, W/o రామరెడ్డి అక్రమంగా మద్యం విక్రయించే కేంద్రాలపై నిఘా కొనసాగుతుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని భీమిలి CI జి. దివాకర్ యాదవ్ తెలిపారు.
Admin
Neti Sakshyam