Tuesday, 04 August 2026 06:28:39 AM

డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసన.. లోకేష్ రాజీనామా కోసం డిమాండ్

Date : 28 July 2026 07:03 PM Views : 53

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖపట్నం : విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ఎల్‌ఐసీ వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడుతూ, డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ఎన్నికల హామీలైన నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర విద్యార్థి, యువజన నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామకాల్లో స్పోర్ట్స్ కోటా భర్తీలలో నియమావళి మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: