Friday, 12 June 2026 03:12:23 AM

మత్యకారులకు అండగా భీమిలి MLA గంటా శ్రీనివాసరావు

Date : 01 March 2026 07:40 PM Views : 334

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మార్చి 1: భీమిలి జోన్–1 బోయవీధికి చెందిన మత్స్యకారుడు సురివిన వీర్రాజు సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ₹5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును ఆయన భార్య సురివిన చిన్నకు భీమిలి ఎమ్మెల్యే Ganta Srinivasa Rao అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ఎమ్మెల్యే ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించడంలో అధికారులు వేగంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం ప్రతినిధులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :