Sunday, 27 September 2026 04:28:58 PM

భక్తి శ్రద్ధలతో బంగారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.

Date : 21 October 2024 05:57 PM Views : 1277

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : అక్టోబర్ 21 సాక్ష్యం న్యూస్,: మండలంలోని విలాసఖానపాలెం గ్రామంలో భక్తుల సహకారంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన నూతన బంగార్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్థానికులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామం నుంచే కాకుండా, పరిసర గ్రామాల ప్రజలు కలిసి సుమారు ఎనిమిది లక్షల రూపాయలను విరాళాలుగా అందజేశారు. పచ్చని పంట పొలాల మద్య అమ్మవారి నూతన ఆలయాన్ని నిర్మించగా. అంతకుముందున్న ఆలయం చిన్నది కావడంతో దానిని తొలగించి అదే స్ధానంలో ఈ నూతన ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సుమారు రెండు వేల మందికి అన్నదానం చేసారు.

Naidu (Sr Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :