Sunday, 27 September 2026 04:30:59 PM

పద్మనాభం KGBV పాఠశాలలో RJD విజయ్ భాస్కర్

Date : 10 December 2024 04:46 PM Views : 1629

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : డిసెంబరు 10 సాక్ష్యం న్యూస్: ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుంటూ..చక్కగా చదువుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని RJD విజయ్ భాస్కర్ అన్నారు. మంగళవారం బాలికా శిశు అభివృద్ధి అధికారి డాక్టర్ కాలేషా బేగంతో కలసి పద్మనాభం KGBV పాఠశాలను సందర్శించిన సందర్భంగా విద్యార్దినులతో మాట్లాడారు. విద్యా బోధన మరియు భోజన సదుపాయాలు గురించి వివరాలను సేకరించడం తోపాటు స్వయంగా ఆహార పదార్థాలు రుచి చూచి సంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ గ్రేస్ లిల్లీ మరియు సిబ్బందితో సమావేశం నిర్వహించి మార్గదర్శకాలను ఇవ్వడంతో పాటు విద్యార్థి ప్రవర్తనా రికార్డును నిర్వహించాలని సూచించారు.పిల్లల పట్ల మమేకమై రాబోయే ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో మంచి స్కోరు సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :