Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : డిసెంబరు 24 సాక్ష్యం న్యూస్: ఇంటిపై క్రిస్మస్ స్టార్ పెట్టుకుని ఇంట్లో కీచులాడుకోవడం వలన ప్రయోజనం ఏముంటుందని Mpp K.రాంబాబు అన్నారు. పద్మనాభం మండలం మద్ది గ్రామంలో సోమవారం సాయంత్రం దైవ స్వరూపి ప్రార్థన సహవాసం ఆద్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆయన ముఖ్య అథిదిగా పాల్గొని మాట్లాడారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకుని యావత్ ప్రపంచం క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం గొప్ప విషయమన్నారు. ఏసుక్రీస్తు తన ఇంట్లోనే పుట్టాడన్న విశ్వాసాన్ని వ్యక్త పరుస్తూ..చాలా మంది ఇంటిపై స్టార్ పెట్టుకుంటారని.. మరి ఇంట్లో 'వార్' ఆపక పోతే? ఏం ప్రయోజనమన్నారు. ఆయన క్షమియించే వాడని...మనం కూడా ఒకరినొకరు క్షమించు కునే మనస్తత్వం కలిగి యుండటమే..నిజమైన క్రిస్మస్ అని గుర్తుచేసారు. దీంతో వేదికపైన మరియు వేదిక ముందున్న స్థానికులు, విశ్వాసులు ఆయన ప్రసంగానికి చప్పట్ల వర్షం కురిపించారు. అనంతరం Mpp రాంబాబును దైవజనులు సుధాకర్ మరియు సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.అంతకుముందు క్రిస్మస్ పాటలు, నృత్యాలు,కేండిల్ సర్వీసు ఆహుతులను అలరించాయి. స్థానిక సంఘ కాపరి కాళ్ళ భాస్కర్ (సుధాకర్) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam