Sunday, 27 September 2026 04:28:53 PM

హైందవ శంఖారావం సభను విజయవంతం చేయాలి

Date : 03 November 2024 04:25 PM Views : 1705

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు : నవంబర్3 సాక్ష్యం న్యూస్: హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి హిందూ ధార్మిక సంఘాలకు అప్పగించాలనే డిమాండ్ తో జనవరి 5న విజయవాడ లో హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రరాజు వేణుగోపాల రాజు అన్నారు. ఆదివారం ఏలూరులోని గ్రాండ్ కృష్ణ కళ్యాణ మండపం లో హైందవ శంఖారావం జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీ యాజ్ఞ వల్క్య రాజాశ్రమాధిపతులు కృష్ణచరణానందభారతీ స్వామీ,విశ్వహిందూ పరిషత్ క్షేత్ర విధినిధి ప్రముఖ కస్తూరి సూర్య ప్రకాష్,ఏలూరు జిల్లా సంఘచాలక్ గడ్డమనుగు సత్యనారాయణ,ప్రాంత కళాశాల విద్యార్థి ప్రముఖు వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. నాలుగు లక్షలమంది తో విజయవాడ లో నిర్వహిస్తున్న హైందవ శంఖారావ సభ ద్వారా దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్టం చేయాలని విశ్వహిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. దేవాలయ ట్రస్ట్ బోర్డులలో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా హిందూ దైవ భక్తులకు మాత్రమే స్థానం కల్పించాలని, హైందవ శంఖారావ సభకు పెద్ద సంఖ్యలో హిందువులు తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా హైందవ శంఖారావం కరపత్రాన్ని ఆవిష్కరించారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, పెద్ద విశ్వహిందూ పరిషత్ , బిజెపి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :