Sunday, 05 April 2026 10:02:31 PM

*వెల్లంకిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి*

Date : 07 December 2024 07:05 AM Views : 1317

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : డిసెంబర్ 6 సాక్ష్యం న్యూస్: ఆనందపురం మండలం వెల్లంకి గ్రామపంచాయతీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని గ్రామ సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు మాట్లాడుతూ మన మధ్య అంబేద్కర్ లేనప్పటికీ ఆయన భావజాలం అయిన రాసిన భారత రాజ్యాంగం మన మధ్యనే ఉన్నాయని గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో వెల్లంకి గ్రామపంచాయతీ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :