Sunday, 27 September 2026 04:31:47 PM

టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

Date : 27 October 2024 04:25 PM Views : 1588

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలూరు : అక్టోబర్ 27 :సాక్ష్యం న్యూస్: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రారంబించిన టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన సోదరుడు పుట్టా రవి కుమార్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఏలూరు జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టేందుకు విస్తృతంగా కృషి చేసినట్లు రవికుమార్ తెలిపారు. రూ.100లకు సాధారణ సభ్యత్వం, రూ. లక్ష విరాళానికి శాశ్వత సభ్యత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కల్పించిందని తెలిపారు. ఈ స‌భ్య‌త్వంతో కార్య‌క‌ర్త‌ల‌కు రూ.5 ల‌క్ష‌ల ప్ర‌మాద భీమాతో పాటు కుటుంబ సభ్యులకు విద్య‌, వైద్యం, ఉపాధి కోసం తెలుగుదేశం పార్టీ సాయం అందిస్తుందని గుర్తుచేసారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయానికి వచ్చే నాయకులు, కార్యకర్తలు, ప్రజలు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :