Friday, 12 June 2026 04:34:31 AM

జాతీయ పంచాయతి రాజ్ దినోత్సవంలో భీమిలి ప్రజా ప్రతినిధులు

Date : 25 April 2025 08:58 AM Views : 857

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : అమరావతి ఏప్రిల్ 24 సాక్ష్యం న్యూస్: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై,పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్,గ్రామీణ నీటిసరఫరా, సోషల్ ఆడిట్,ఎస్ఐర్డీ వంటి విభాగాలతో కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామాలు స్వయం సమృద్ధిగా మారాలని, గ్రామీణ జీవన విధానాన్ని ప్రోత్సహించాలనే దిశగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 2024 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ అవార్డులు పొందిన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లకు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. ఈ వేడుకల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రజల అభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గం నుంచి ZPTC గాడు వెంకటప్పడు, సింగనభంద సర్పంచ్ గాడు వెంకట నారాయణ, టి. నగర పాలెం సర్పంచ్ శ్రీమతి పొట్నూరు ఛాయా గౌతమి శేఖర్, తాటితూరు సర్పంచ్ శ్రీమతి శిరిగిడి సంతోషి ఈశ్వర్, భీమునిపట్నం రూరల్ మండల నుండి ప్రతినిధులుగా పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :