Sunday, 27 September 2026 04:30:33 PM

గోపన్నపాలెంలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమం పై రెవెన్యూ గ్రామసభ

Date : 11 December 2024 03:22 PM Views : 1540

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు : డిసెంబర్ 11, సాక్ష్యం న్యూస్ మీ భూమి మీ హక్కు నినాదంతో భూముల రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహి బిషన్) యాక్ట్ 2024 లో ప్రవేశపెట్టడం జరిగిందని దీనిని కొనసాగింపుగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభ నిర్వహిస్తున్నామని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. బుధవారం దెందులూరు మండలం గోపన్న పాలెం గ్రామపంచాయతీ ఆవరణలో దెందులూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు)దెందులూరు మండల ప్రత్యేక అధికారి జిల్లా హౌసింగ్ పీడీ సత్యనారాయణ ,దెందులూరు తాహసిల్దార్ బి సుమతి, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యలపై బాధితులు అధికారుల చుట్టూ తిరగటం కాదు అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది ఈ భూ రెవిన్యూ గ్రామ సభ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ సమావేశంలో దెందులూరు ఎంపీడీవో శ్రీదేవి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతా సుబ్బారావు, టిడిపి నాయకులు మారగాని సత్యనారాయణ, ఏనుగు కేబుల్ శీను, బజారు గణేషు, చమళ్ళమూడి రాము,మాజీ ఎంపీటీసీ కొలంటి భవానీ ప్రసాద్, తెలుగు యువత నాయకులు బోర్రా చందు ,జనసేన నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ కొండేటి హనుమంతు, గ్రామ రెవెన్యూ అధికారి మారగాని రామారావు,మరియు మండల స్థాయి అధికారులు,సచివాలయ సిబ్బంది రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :