Sunday, 27 September 2026 04:28:34 PM

గెలుపు ఓటమి సహజమే: MPP రాంబాబు

Date : 15 January 2025 04:36 PM Views : 1409

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : జనవరి 15 సాక్ష్యం న్యూస్: తెలుగువారి సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆద్వర్యంలో పద్మనాభం మండలం మద్ది గ్రామంలో నిర్వహించిన కబడ్డీ పోటీలకు విశేష స్పందన లభించింది. స్థానిక సర్పంచ్ బుగత సత్యనారాయణ మరియు Mpp కంటుబోతు రాంబాబు పర్యవేక్షణలో సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తూ చేపట్టిన ఈ పోటీలను ఈ నెల 11, 12, 13 తేదీలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా... నరవ గ్రామం మూడవ స్థానంలో,వి.ఆర్.పేట రెండవ స్థానంలో, జామి మొదటి స్థానంలో నిలిచి 7వేలు, 5వేలు, 3 వేలు నగదు బహుమతులను గెలుచుకున్నాయి. స్థానిక సర్పంచ్ మరియు MPP చేతుల మీదుగా విజేతలు బహుమతులను అందుకున్నారు. మద్ది గ్రామంలో నిర్వహించిన ఈ పోటీలలో స్థానిక జట్టు ఎలాంటి స్థానాన్ని సంపాదించుకోకపోవడంతో స్థానిక క్రీడా అభిమానుల్లో నిరుత్సాహాం కనిపించింది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పోటీలు నిర్వహించడం క్రీడా కారులను ప్రోత్సహించడం కొనసాగుతోందని గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ... లక్ష్యంతో ముందుకు సాగి..అంతర్జాతీయ స్థాయిలో నిలిచి మన భారత దేశానికి పేరు తెచ్చిపెట్టాలని MPP రాంబాబు క్రీడాకారుల నుద్దేశించి మాట్లాడారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: