Sunday, 27 September 2026 04:29:13 PM

భీమిలి డైట్ కళాశాలలో సంక్రాంతి శోభ

Date : 09 January 2025 07:09 PM Views : 1607

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : జనవరి 9 సాక్ష్యం న్యూస్: సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే పల్లె పండుగల విశిష్టతను నేటి తరానికి అందించే భాద్యత ప్రతి ఉపాధ్యాయుల పైన ఉందని జిల్లా విద్యాశాఖ ప్రిన్సిపాల్ ఎం. జ్యోతి కుమారి అన్నారు. భీమిలి డైట్ కళాశాలలో సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన వేడుకలలో ఆమె పాల్గొని మాట్లాడారు. నేటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగై పోతోన్న ఈ రోజుల్లో వాటి విశిష్టతను వెలికితీసే ఈ కార్యక్రమాలు నేటి యువతరానికి ఎంతో అవసరమని వివరించారు. చాత్రోపాధ్యాయులు ఈ అంశాలపై అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని సృష్టించడం తోపాటు గంగిరెద్దులు, రంగవల్లులు, సోదిమ్మ కథలు, చిలక జోస్యం, డప్పులోళ్ళ సంబరం మొదలగు అంశాల ప్రదర్శించి ఔరా? అనిపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అద్యాపకులు ఎల్. సుధాకర్, జి. జి. ఎస్. నాగేశ్వరరావు, అధ్యాపకులు మాధవి, మహాలక్ష్మి , త్రినాధరావు, నీలిమ తదితరులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :