Friday, 12 June 2026 03:13:42 AM

పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ.

Date : 10 December 2024 10:24 AM Views : 1567

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : డిసెంబర్ 9 సాక్ష్యం న్యూస్: మండలంలోని గొట్టిపల్లి గ్రామపంచాయతీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు పేద విద్యార్థినులకు శ్రీ మహాలక్ష్మి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ ( బోసు బాబు) సైకిళ్ళు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. గొట్టిపల్లి హై స్కూల్లో చదువుతున్న జాన వరలక్ష్మి(9వ తరగతి), పిళ్లా వర్ష (7వ తరగతి) దూర ప్రాంతం నుంచి నిత్యం నడిచి రావటం తన దృష్టికి వచ్చిందని దీంతో నిత్యం చేపడుతున్న సేవాకార్యక్రమాల్లో భాగంగా ఈ సహాయాన్ని అందించినట్లు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా బోసుబాబు కు స్థానిక నాయకులు, పాఠశాల హెచ్ఎం, మరియు ఉపాద్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోరాడ నాయుడు బాబు, పాఠశాల కమిటీ కమిటీ చైర్మన్ వెన్ని నారాయణరావు, గిడిజాల మాజీ సర్పంచ్ కోరాడ రాము, కూటమి నాయకులు ఎర్ర బంగారు నాయుడు ( బన్నీ), కోరాడ వైకుంఠ, కోరాడ తమ్మునాయుడు, సుంకర శివ ఇతర నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :