Wednesday, 05 August 2026 11:00:36 AM

భీమిలిలో ఏకమైన ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు

Date : 27 January 2025 04:43 PM Views : 1679

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : సాక్ష్యం న్యూస్: థామస్ అల్వా ఎడిసన్ ఎలక్ట్రికల్‌ బల్బు ను కనుగొని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన రోజును పురస్కరించుకొని భీమునిపట్నం లోని ఎలక్ట్రీషిన్లు, ప్లంబర్లు ఏకమై భీమిలి టౌన్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమిలి చిన్నబజారు జంక్షన్ వేదికగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పోలీసు, రెవెన్యూ, జీవియంసి,విద్యుత్ శాఖల అధికారులను ముఖ్య అథిదులుగా ఆహ్వానించి వారి చేతులమీదుగా అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అథిదులను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా భీమిలి టౌన్ ఎలక్ట్రికల్ & ప్లంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకల సన్నిబాబు మాట్లాడుతూ... ఎన్నో ఏళ్ళుగా తాము ఈ వృత్తి పైనే ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుని జీవనం సాగిస్తుండగా...ప్రమాదాల బారిన పడి తమలో చాలామంది గాయాలపాలై, ప్రాణాలు కోల్పోయే సంఘటనలు అన్నీ ఇన్నీ కావని గుర్తు చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో మాత్రమే ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. అనంతరం అసోసియేషన్ కార్యదర్శి K.V రమణ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ మరియు ప్రయివేటు కార్యాలయాలతో పాటు పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, అపార్ట్మెంట్లకు కరెంటు సమస్యలు తలెత్తితే గుర్తొచ్చేది ఎలక్ట్రీషనే అన్నారు. అటువంటి తమ ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందు కోసమే వెల్ఫేర్ అసోసియేషన్ స్తాపించామని వివరించారు. ప్రభుత్వాలు తమను, తమ వృత్తిని గుర్తించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమిలి తహశీల్దారు P. రామారావు, భీమిలి జోన్-1 కమీషనర్‌ ప్రేమ ప్రసన్న వాణి భీమిలి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ హరీష్, మరియు విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ లంకా రమేష్,CITU భీమిలి డివిజన్ అధ్యక్షుడు RSN మూర్తి,ఎలక్ట్రికల్‌ & ప్లంబర్స్ అసోసియేషన్ కోశాధికారి కంటుబోతు.రవి, కార్యవర్గ సభ్యులు, ఎలక్ట్రీషియన్లు,ప్లంబర్లు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: