Friday, 12 June 2026 04:32:49 AM

వ్యాపారం పేరుతో ఆక్రమణ. రాకపోకలకు అంతరాయం.

Date : 16 December 2024 02:19 PM Views : 1850

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : డిసెంబరు 16 సాక్ష్యం న్యూస్: దేశంలోనే ఓ ప్రముఖ పట్టణంగా పిలవబడే భీమిలిను దగ్గరగా చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే...తమ స్వార్ధ ప్రయోజనాలకు చిరువ్యాపారులు అడ్డదిడ్డంగా ప్రధాన రహదారులను సైతం ఆక్రమించేస్తూ...ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నారు. మరోవైపు భీమిలి బీచ్ వద్ద పొట్టి శ్రీరాములు పార్క్, అయ్యప్ప స్వామి ఆలయాలకు ఆనుకుని ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహణ భక్తులకు, పర్యాటకులకు ఇబ్బంది కలుగుతుందని ప్రజా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న ఈ సమస్యను పలు వార్తాపత్రికల ద్వారా ఎన్నో కథనాలను ప్రచురించినప్పటికీ...ఎలాంటి పరిష్కారం జరగని కారణంగా సోమవారం స్థానిక ఫాబ్,పీపుల్స్ పవర్,ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలి ( FAB) మరియు భీమిలి ప్రెస్ క్లబ్ సంయుక్తంగా భీమిలి జోన్ 1 కమీషనర్ కి వినతిపత్రం ఇచ్చారు. చిరు వ్యాపారాలను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను క్రమ బద్దీకరించాలని, పర్యాటకులకు భక్తులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జోనల్ కమీషనర్ ప్రేమ ప్రసన్న వాణికి వివరించారు. సానుకూలంగా స్పందించిన ZC త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ పవర్ సభ్యులు, ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలి (FAB) సభ్యులు, మరియు భీమిలి (BPC)జర్నలిస్టులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :