Tuesday, 04 August 2026 08:20:12 AM

పద్మనాభం KGBV పాఠశాలను సందర్శించిన DEO.

Date : 14 December 2024 01:37 PM Views : 1722

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : డిసెంబరు 14 సాక్ష్యం న్యూస్: విద్యార్థినులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని.. పాఠశాలకే గర్వకారణంగా నిలవాలని జిల్లా విద్యా శాఖ అధికారి (DEO) N. ప్రేమ్ కుమార్ అన్నారు. శనివారం పద్మనాభం KGBV పాఠశాలను సందర్శించిన సందర్భంగా విద్యార్ధినులతో మాట్లాడారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న మీరంతా పెద్ద లక్ష్యాలను కలిగి ఉండాలని...ఆ లక్ష్యాలను చేరుకునేందుకు చదువు పట్ల అంకిత భావం కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా పది, పదకొండు తరగతులకు చెందిన అత్యధిక స్కోరు సాధిస్తున్న విద్యార్థినులు ఎంతమంది ఉన్నారనేది తెలుసుకుని వారితో మాట్లాడారు. మరింత ఫలితాలను సాధించేందుకు పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. అనంతరం కాస్త తక్కువ స్కోరులో ఉన్న విద్యార్థినులతో మాట్లాడారు. నిరుత్సాహ పడకుండా శ్రద్ధగా చదువుకోవాలని వారిలో ప్రేరణ కలిగించారు. రానున్న SSC, ఇంటర్ పరీక్షల్లో 100 శాతం ఫలితాలు సాధించేందుకు ఉపాద్యాయులు కూడా శ్రద్ద వహించాలని సూచించారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :