Tuesday, 04 August 2026 08:34:15 AM

ప్రభుత్వ భూములను కాపాడండి.//పిట్టా సురేష్//

Date : 11 December 2024 03:10 PM Views : 1539

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ తగరపువలస : ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని విశాఖ పార్లమెంటరీ సెక్రటరీ పిట్టా సురేష్ అన్నారు. భీమిలి తహశీల్దారు రామారావు ఆద్వర్యంలో చిట్టివలస సచివాలయంలో నిర్వహించిన మీ భూమి - మీ హక్కు రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. తగరపువలస ప్రాంతంలో పలు ప్రజా అవసరాలైన జూనియర్ కాలేజీ, ఆసుపత్రి,ఆర్టీసీ కాంప్లెక్స్ , కళ్యాణ మండపం, స్పోర్ట్స్ క్లబ్, అంగన్వాడి సెంటర్లు, పోలీస్ స్టేషన్, సచివాలయ భవనాలు వంటి వాటి కోసం భూమి అవసరం వుందని... ప్రభుత్వ భూమిని పరిరక్షించి ప్రజా అవసరాల కోసం వినియోగించాలని కోరారు. చిట్టివలస చెరువు పై సమగ్ర సర్వే చేపించి హద్దులు నిర్ణయించి ఆక్రమణలు తొలగించాలని.. చిట్టి వలస జ్యూట్ మిల్ యాజమాన్యం ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కూడా స్వాధీన పరచు కోవాలి కోరుతూ.. పలువురు రైతులు వారి రికార్డుల్లో ఉన్న తప్పులను సరిచేయాలని పలు వినతి పత్రాలను తహశీల్దారు రామారావుకి అందజేశారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ చిన్ని కుమారి లక్ష్మి, మాజీ కౌన్సిలర్లు బడిగంటి నీలకంఠం,పిట్ట వెంకట్రావు, చేట్ల రమణ, అడ్డగర్ల రవికుమార్, రైతులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: