Sunday, 27 September 2026 04:31:42 PM

రాష్ట్ర స్థాయి కౌశల్ క్విజ్ కు భీమిలి విద్యార్థి

Date : 10 December 2024 04:47 PM Views : 1761

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : డిసెంబరు 10 సాక్ష్యం న్యూస్: స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దాసరి మనోజ్ రాష్ట్రస్థాయి కౌశల్ క్విజ్ కు ఎన్నికయ్యాడు.విశాఖ జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు మాత్రమే కౌశల్ క్విజ్ కి ఎన్నికవ్వగా....వారిలో మనోజ్ ఒకరిగా నిలవడం గొప్ప విషయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇమంది వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుల చేతుల మీదుగా ఆయన బహుమతిని అందిస్తూ..మాట్లాడారు. "మనోజ్ కుమార్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికవ్వడం తమ పాఠశాలకే గర్వకారణమన్నారు. మరిన్ని పోటీలలో పాల్గొని పాఠశాలకు,తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మనోజ్ కు గైడ్ టీచరుగా వ్యవహరించిన నయీమ్ అన్సారిని అభినందించారు"... ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అల్లాడ శ్రీనివాసరావు, ఆల్తి రామకృష్ణ,చీపుల్ల అశోక్, రాణి, రాజు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :