Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / ఏలురు/దెందులూరు : డిసెంబర్ 9 :సాక్ష్యం న్యూస్: గత రెండు రోజులుగా తనపై కూటమి నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలు మరియు ఆందోళనకు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఘాటుగా స్పందించారు. కొల్లేరు ప్రాంతంలో గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి సంక్షేమం అందించానని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని చేస్తున్న రాజకీయ కుట్ర గ్రామస్తులను వారి చెరువుల్లో చేపలు పట్టుకోనియకుండా అడ్డంకులు సృష్టిస్తూ.. లీజు విషయంలో భయపెట్టడుతున్నారని ఆరోపించారు. అంతే కాకుండా.. వారిని పిలిపించి నాపై ఆసత్య ఆరోపణలను చేయమని, ఆందోళన చేయాలని బెదిరించినట్లు తనకు సమాచారం ఉందన్నారు. 2014 – 19 లో కూడా గ్రామస్తులను బెదిరించి కొల్లేరు ప్రాంతంలోని అనేక గ్రామాల్లో చేపల లీజుల విషయంలో చాలా అరాచకాలు చేసిన చరిత్ర ఉన్న చింతమనేని, మళ్ళీ దౌర్జన్యాలకు తెర తీశారని, కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ద్వజమెత్తారు. కొల్లేరులో సెంటు భూమైనా తన పేరు మీద ఉందని రుజువు చేస్తే, తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఇకనైనా టిడిపి నాయకులు ఇటువంటి నీచ ప్రయత్నాలు మాని, దెందులూరు నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
Reporter
Neti Sakshyam