Friday, 12 June 2026 03:14:40 AM

కస్తూర్బా గాంధీ పాఠశాలకు వెయిటింగ్ హాల్

Date : 07 December 2024 07:26 PM Views : 1402

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : డిసెంబరు 7 సాక్ష్యం న్యూస్: ఆనందపురం మండలం ఎల్.వి పాలెం పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలకు శ్రీ మహాలక్ష్మి కల్చర్ అసోసియేషన్ ఆర్థిక సాయంతో వెయిటింగ్ హాల్ నిర్మాణానికి ఆ సంస్థ అధినేత ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ ముందుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ ముఖ్య అథిదిగా హాజరై ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేసారు. సుమారు 20 లక్షలతో నిర్మిస్తుడగా...విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులకు వేచియుండేందుకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి కే.శివాజీ, ఎం.ఈ.ఓ గంగరాజు, ఎంపీడీవో డాక్టర్ వి. జానకి, డి ఓ ఆర్ డి రాము, స్కూల్ చైర్మన్ అప్పలరాజు, వైస్ చైర్మన్ వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :